ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 1:58 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

గిరిజన ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన డీటీడీఓ మరియు ఎస్‌ఐ.

గిరిజన ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన డీటీడీఓ మరియు ఎస్‌ఐ.

భీమారం(మంచిర్యాల),అర్జున్ సమాచారం, ఆగస్టు 21:

భీమారం మండల కేంద్రంలోని బి.సి, ఎస్.సి సమీకృత బాలుర వసతి గృహం మరియు గిరిజన ఆశ్రమ పాఠశాలను శుక్రవారం నాడు స్థానిక ఎస్.ఐ ఏ. రాజేందర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన బాలుర వసతి గృహంలోని ప్రతీ గదిని పరిశీలించి, విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులు, తాగునీరు, పరిశుభ్రత తదితర అంశాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు లేదా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు.

అనంతరం ఆశ్రమ పాఠశాల కి వెళ్ళి ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోజువారీ మెనూ సరిగా పాటిస్తున్నారా లేదా, ఆహారం రుచిగా, నాణ్యతగా ఉందో లేదో విద్యార్థులతో మాట్లాడి డి‌టి‌డి‌ఓ యూ .సురేష్ ను అడిగి తెలుసుకున్నారు.

తరగతి గదికి వెళ్ళి విద్యార్థులతో వారి చదువుల పురోగతి గురించి తెలుసుకున్నారు. క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని, సమయాన్ని వృథా చేయకుండా లక్ష్యం దిశగా సాగాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఉన్నత విద్య, భవిష్యత్ మార్గదర్శకాలపై పలు కీలక సూచనలు అందించారు.

ఈ ఆకస్మిక తనిఖీ కార్యక్రమంలో జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి (డి‌టి‌డి‌ఓ) యు. సురేష్, ఎస్‌ఐ ఏ .రాజేందర్ , హాస్టల్ సంక్షేమాధికారి (హెచ్‌డబల్యూ‌ఓ ) పురుషోత్తం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు (హెచ్‌ఎం) చల్లా మహేశ్వర్ రెడ్డి, ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు